![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -57 లో.. ఇంట్లో అందరు డల్ గా కూర్చొని ఉంటారు. చందు ధీరజ్ దగ్గరికి వచ్చి.. మీరు మన గదిలోకి వెళ్ళండి. మేము వేరే గదిలో ఉంటామని అంటాడు. గదిలోకి ప్రేమ, ధీరజ్ లు వెళ్తారు. మీరు ఫ్రెషప్ అవ్వండి అని నర్మద ప్రేమకి బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత నర్మదని సాగర్ పక్కకి పిలిచి.. ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అదేం లేదని నర్మద కవర్ చేస్తుంది.
ఆ తర్వాత నర్మద, వేదవతిలు వంట చేస్తారు. నర్మద అందరిని భోజనానికి పిలుస్తుంది. ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. వాళ్ళకి గదిలోకి భోజనం తీసుకొని వెళ్తుంది. మిగతా వాళ్లు భోజనం చేస్తుంటే గదిలో ప్రేమ, ధీరజ్ లు గొడవ పడుతుంటారు. అది విని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఎందుకు అలా గొడవ పడుతున్నారని కామాక్షి వాళ్లు అనుకుంటారు. దాంతో వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారని నార్మద కవర్ చేస్తుంది. ఆ తర్వాత నార్మద, వేదవతిలు ప్రేమ, ధీరజ్ ల దగ్గరికి వెళ్లి మీ గొడవ బయటకు వినిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. రెండు కుటుంబాలా గురించి అలోచించి సర్దుకుపోండి అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది.
దాంతో ప్రేమ, ధీరజ్ లు సైలెంట్ అయిపోతారు. ధీరజ్ తన ప్లేట్ తీసుకొని తింటూ ప్రేమకి ఒక ప్లేట్ ఇస్తాడు. ప్రేమ భోజనం చేస్తుంది. వేదవతి, రామరాజుల దగ్గరికి వస్తుంది. తను జరిగిన దానికి బాధపడుతుంటాడు. వేదవతి వెళ్లిపోతుంది. మరొకవైపు ప్రేమ తన ఇంటివైపు చూస్తూ బాధపడుతుంటే వేదవతి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |